
హీరో నాని సమర్పణలో నితిన్ హీరోగా నటించనున్న కొత్త చిత్రానికి 'అలియాస్ రుక్మిణీ' అనే టైటిల్‌ను ఖరారు చేశారు.
హైదరాబాద్‌లో సోమవారం లాంఛనంగా ప్రారంభమైన ఈ చిత్రానికి 'దండోరా' ఫేమ్ మురళీకాంత్ దర్శకత్వం వహిస్తున్నారు.
నటుడిగా బిజీగా ఉన్న నాని, ఈ సినిమాతో నిర్మాతగా మరో ప్రాజెక్టును ప్రేక్షకులకు అందిస్తున్నారు.