
17 ఏళ్ల భారత యువ షట్లర్ తన్వి శర్మ, తైపీ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీ మహిళల సింగిల్స్ ఫైనల్లో వియత్నాంకు చెందిన థుయ్ లిన్ ఎంగుయెన్ను 21-16, 21-16తో ఓడించి టైటిల్ గెలుచుకుంది.
ఈ విజయంతో తన కెరీర్లో తొలి బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ సూపర్-300 టైటిల్ను కైవసం చేసుకున్న తన్వి, 18 ఏళ్ల తర్వాత ఈ టోర్నీలో విజేతగా నిలిచిన రెండో భారతీయురాలిగా చరిత్ర సృష్టించింది.
కేవలం 36 నిమిషాల్లోనే మ్యాచ్ ముగించిన తన్వి, పతక ప్రదానోత్సవం అనంతరం తన స్వర్ణ పతకాన్ని కోచ్ పార్క్ టే-సాంగ్కు అంకితం చేస్తూ కృతజ్ఞతలు తెలిపింది.