
నీట్-యూజీ పరీక్ష నిర్వహణను కఠినతరం చేసేందుకు ఆన్లైన్ మరియు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (CBT) విధానాన్ని పరిశీలిస్తున్నట్లు కేంద్రం సుప్రీంకోర్టుకు తెలిపింది.
జేఈఈ తరహాలో రెండు దశల్లో పరీక్ష నిర్వహించడం ద్వారా అవకతవకలకు అడ్డుకట్ట వేయవచ్చని కేంద్రం అఫిడవిట్లో పేర్కొంది.
నందన్ నీలేకని నేతృత్వంలోని టాస్క్ఫోర్స్ సూచనల మేరకు తుది నిర్ణయం తీసుకుంటామని, విద్యార్థులపై ఏకపక్ష నిర్ణయాలు రుద్దబోమని కేంద్రం హామీ ఇచ్చింది.