
విశాఖపట్నం అరిలోవలోని తోటగరువులో పీవీ సింధు సెంటర్ ఫర్ స్పోర్ట్స్ ఎక్స్‌లెన్స్ నిర్మాణానికి మంత్రి నారా లోకేశ్ ఆగస్టు 5, 2026న భూమిపూజ చేశారు.
ఈ కార్యక్రమంలో క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, ఏపీ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
అత్యాధునిక సౌకర్యాలతో నిర్మించనున్న ఈ అకాడమీ భవన నమూనాను, క్రీడాకారులకు అందుబాటులోకి రానున్న వసతులను మంత్రి లోకేశ్ పరిశీలించారు.