
హైదరాబాద్‌లోని ఇందిరమ్మ టవర్లలో గృహాల కేటాయింపు కోసం ఆగస్టు 28 నుంచి 31 వరకు లక్కీ డ్రా ప్రక్రియను గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ప్రకటించారు.
మొత్తం 60,720 దరఖాస్తులను పరిశీలించగా, అందులో 40,900 మందిని అర్హులుగా గుర్తించామని, ఎంపిక కాని వారికి రూ. 10,000 ఈఎండీని తిరిగి జమ చేస్తామని మంత్రి తెలిపారు.
రాబోయే రోజుల్లో మరో 1,920 ఇళ్లను నిర్మించేందుకు స్థలాలను ఎంపిక చేశామని, ఆసక్తి గల నిరుపేదలు సెప్టెంబర్ 3వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం సూచించింది.