
ఫిన్లాండ్పై 8 వికెట్ల తేడాతో విజయం సాధించిన స్పెయిన్, అంతర్జాతీయ క్రికెట్లో వరుసగా 21 విజయాలు నమోదు చేసి ప్రపంచ రికార్డు సృష్టించింది.
2003లో రికీ పాంటింగ్ కెప్టెన్సీలో ఆస్ట్రేలియా నెలకొల్పిన 20 వరుస విజయాల రికార్డును స్పెయిన్ జట్టు అధిగమించింది.
కెరవా వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో స్పెయిన్ బౌలర్లు ఫిన్లాండ్ను 131 పరుగులకే కట్టడి చేయగా, బ్యాటర్లు 16.4 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించారు.