
రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురవాలని, కృష్ణా, గోదావరి నదులు జలకళను సంతరించుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ఆగస్టు 10న మహా వరుణ యాగం నిర్వహించనున్నారు.
నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ విజయవిహార్ ఆవరణలో 11 హోమగుండాలతో, 108 మంది వేద పండితుల సమక్షంలో ఈ యాగం జరగనుంది.
ఆగస్టు 10 మధ్యాహ్నం 3:20 నుంచి 3:24 గంటల మధ్య జరిగే పూర్ణాహుతి కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డితో పాటు పలువురు మంత్రులు హాజరుకానున్నారు.