
పాకిస్థాన్ ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని, సౌదీ అరేబియా తన వద్ద ఉన్న 5 బిలియన్ డాలర్ల డిపాజిట్ల చెల్లింపు గడువును మరో మూడేళ్లపాటు పొడిగించింది.
పాకిస్థాన్ విదేశీ రుణ చెల్లింపుల భారం 2026-27 ఆర్థిక సంవత్సరానికి 21.5 బిలియన్ డాలర్లకు తగ్గుతుందని స్టేట్ బ్యాంక్ ఆఫ్ పాకిస్థాన్ గవర్నర్ జమీల్ అహ్మద్ తెలిపారు.
ప్రస్తుతం పాకిస్థాన్ వద్ద 17.2 బిలియన్ డాలర్ల విదేశీ మారక నిల్వలు సెంట్రల్ బ్యాంక్లో ఉన్నాయని అధికారిక గణాంకాలు వెల్లడిస్తున్నాయి.