
ప్రకాశం జిల్లా ప్రజల దశాబ్దాల కల అయిన పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టును సోమవారం రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించనున్నారు.
ఈ ప్రాజెక్టు ద్వారా నల్లమల సాగర్‌కు కృష్ణా జలాలను అందించే ప్రక్రియను సీఎం చేపట్టనుండటంతో మార్కాపురం ప్రాంతంలో సంబరాలు అంబరాన్నంటుతున్నాయి.
సీఎం పర్యటన నేపథ్యంలో మార్కాపురం మండలంలోని బోడపాడు పాఠశాలలో ప్రాజెక్టు నమూనాను ఆవిష్కరించి, విద్యార్థుల సమక్షంలో నీటిని విడుదల చేశారు.