జోగులాంబ గద్వాల జిల్లాలో ప్రేమ వివాహం చేసుకున్న దళిత యువకుడి ఇంటిని యువతి కుటుంబ సభ్యులు జేసీబీలతో కూల్చివేశారు.
కులాంతర వివాహం చేసుకున్నందుకు కక్షగట్టి ఈ దారుణానికి పాల్పడినట్లు సమాచారం.
ఈ ఘటనపై స్థానికంగా తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి.