తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన చివరి పొలిటికల్ డ్రామా 'జన నాయగన్' (తెలుగులో జన నాయకుడు) త్వరలోనే ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్లో స్ట్రీమింగ్ కానుంది.
థియేటర్లలో మిశ్రమ స్పందన తెచ్చుకున్నప్పటికీ, ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ. 300 కోట్ల క్లబ్లో చేరి విజయ్ బాక్సాఫీస్ స్టామినాను నిరూపించింది.
రూ. 203 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్తో బరిలోకి దిగిన ఈ సినిమా రెండు వారాల్లోనే 60 శాతం రికవరీ సాధించి ఓటీటీ విడుదలకు సిద్ధమైంది.