
ఎయిర్ ఇండియా ముంబయి నుంచి కెనడాలోని టొరంటోకు కొత్తగా నాన్‌స్టాప్ విమాన సర్వీసులను ప్రారంభించనుంది.
2026-27 శీతాకాల సీజన్‌లో భారత్-కెనడా మధ్య వారానికి మొత్తం 20 విమానాలను నడపనున్నట్లు సంస్థ ప్రకటించింది.
ముంబయి-టొరంటో మధ్య ఈ కొత్త సర్వీసులు అక్టోబరు 25 నుంచి 2027 మార్చి 26 వరకు అందుబాటులో ఉంటాయి.