
ఖర్చులను తగ్గించుకునే క్రమంలో అమెరికన్ టెక్ దిగ్గజం ఒరాకిల్ ప్రపంచవ్యాప్తంగా 7,000 నుండి 10,000 మంది ఉద్యోగులను తొలగించాలని యోచిస్తోంది.
ఈ నిర్ణయం వల్ల భారత్‌లో సుమారు 3,000 మంది ఉద్యోగులు ప్రభావితమయ్యే అవకాశం ఉందని కంపెనీ అంతర్గత వర్గాల సమాచారం.
సెప్టెంబర్ 15న కంపెనీ తన తొలగింపు నిర్ణయాలను అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని, 2026లో ఇప్పటివరకు 1,75,000 మంది టెకీలు ఉద్యోగాలు కోల్పోయారని ట్రూఅప్ సంస్థ తెలిపింది.