
కరీబియన్ ప్రీమియర్ లీగ్ (సీపీఎల్)లో సెంట్ కిట్స్ అండ్ నెవిస్ పాట్రియాట్స్ తరఫున ఆడుతున్న దాసున్ షనక 39 బంతుల్లోనే సెంచరీ సాధించి రికార్డు సృష్టించాడు.
షనక మొత్తం 43 బంతుల్లో 8 ఫోర్లు, 12 సిక్సర్లతో 121 పరుగులతో అజేయంగా నిలిచి, లీగ్ చరిత్రలోనే అత్యంత వేగవంతమైన సెంచరీని నమోదు చేశాడు.
ఈ ఇన్నింగ్స్‌తో సెంట్ కిట్స్ అండ్ నెవిస్ జట్టు 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 234 పరుగుల భారీ స్కోరును సాధించింది.