
తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ కేసీఆర్ కుటుంబం లక్ష కోట్ల భూములు దోపిడీ చేసిందని ఆరోపించగా, కేసీఆర్ ఫామ్ హౌస్ భూములపై ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని వేస్తున్నట్లు ప్రకటించారు.
ప్రభుత్వం చెబుతున్నట్లు కేసీఆర్ ఫామ్ హౌస్లో నిజంగానే 388 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంటే ఎమ్మెల్యేలమంతా రాజీనామా చేస్తామని మాజీ మంత్రి హరీష్ రావు సవాల్ విసిరారు.
బీఆర్ఎస్ నేతలు రేవంత్ రెడ్డి కుటుంబ ఆస్తులు, సోదరుడి సంస్థకు తక్కువ ధరకు భూమి కేటాయింపులపై విమర్శలు గుప్పిస్తూ పరస్పర ఆరోపణలకు దిగారు.