
ఎమ్మెల్యే లేదా ఎమ్మెల్సీ కాకుండానే ఆరు నెలలకు పైగా మంత్రిగా కొనసాగుతున్న బీహార్ మంత్రి దీపక్ ప్రకాష్ వ్యవహారంపై సుప్రీంకోర్టు విస్మయం వ్యక్తం చేసింది.
ఆర్టికల్ 164(4) నిబంధన ప్రకారం ఎన్నిక కాకుండా మంత్రిగా ఎలా కొనసాగుతున్నారో వివరణ ఇవ్వాలని బీహార్ ప్రభుత్వాన్ని చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ ఆదేశించారు.
ఈ పిటిషన్పై అత్యవసర విచారణను ఆగస్ట్ 4వ తేదీకి సుప్రీంకోర్టు జాబితా చేసింది.