
భారత ఆర్మీ కోసం ప్రత్యేకంగా రూపొందించిన తొలి కమ్యూనికేషన్ ఉపగ్రహం 'జీశాట్-7బీ'ని 2028 మధ్య నాటికి ఇస్రో ప్రయోగించనుంది.
ఈ ప్రాజెక్టు కోసం రక్షణ మంత్రిత్వ శాఖ 2023 మార్చిలో న్యూస్పేస్ ఇండియా సంస్థతో సుమారు రూ. 3 వేల కోట్ల ఒప్పందం కుదుర్చుకుంది.
ఈ ఉపగ్రహం అందుబాటులోకి వస్తే మారుమూల సరిహద్దు ప్రాంతాల్లో సైనికులకు నిరంతర, సురక్షిత సమాచార వ్యవస్థ లభిస్తుంది.