నెల రోజుల పాటు చక్కెర మానేయడం వల్ల రక్తంలో షుగర్ లెవెల్స్ అదుపులోకి వచ్చి డయాబెటిస్ ముప్పు తగ్గుతుందని, తలనొప్పి, ఫ్రస్టేషన్ నుండి ఉపశమనం లభిస్తుందని నిపుణులు చెబుతున్నారు.
చక్కెరను దూరం చేయడం వల్ల శరీరంలో శక్తి పెరిగి చురుకుగా ఉంటారని, జ్ఞాపకశక్తి మెరుగుపడటంతో పాటు బరువు తగ్గే అవకాశం ఉందని అధ్యయనాలు పేర్కొంటున్నాయి.
చక్కెర మానేయడం వల్ల హార్మోన్ బ్యాలెన్స్ బాగుండి నిద్ర బాగా పడుతుందని, జీర్ణశక్తి మెరుగుపడటంతో పాటు చర్మం క్లియర్‌గా మారి కాలేయం ఆరోగ్యంగా ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు.