
అంతర్జాతీయ ఉద్రిక్తతల మధ్య బుధవారం హైదరాబాద్ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,040 తగ్గి రూ.1,54,310కి చేరింది.
22 క్యారెట్ల బంగారం ధర రూ.950 తగ్గి రూ.1,41,450 వద్ద ఉండగా, కిలో వెండి ధర రూ.2.50 లక్షలుగా నమోదైంది.
అమెరికా-ఇరాన్ మధ్య చమురు ట్యాంకర్ల వివాదం, ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల అంచనాల ప్రభావంతో బంగారం ధరల్లో ఈ మార్పులు చోటుచేసుకున్నాయి.