
దిశా సాలియన్ అనుమానాస్పద మరణంపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి సమగ్ర దర్యాప్తు చేపట్టాలని బాంబే హైకోర్టు బుధవారం సీబీఐని ఆదేశించింది.
2020 జూన్ 8న మలాడ్ ప్రాంతంలోని 14వ అంతస్తు నుండి పడి దిశ మరణించగా, ఐదేళ్లుగా పోస్టుమార్టం నివేదిక అందలేదని కోర్టు ఆందోళన వ్యక్తం చేసింది.
సరిపడా ఆధారాలు లభించే వరకు ఎవరినీ నిందితులుగా పరిగణించవద్దని, దర్యాప్తులో నెగెటివ్ రిపోర్ట్ వస్తే పిటిషనర్లకు ప్రోటెస్ట్ పిటిషన్ దాఖలు చేసే హక్కు ఉంటుందని స్పష్టం చేసింది.