
వకీల్ సాబ్ సినిమా షూటింగ్ సమయంలో నిర్మాతకు ఇబ్బంది కలుగకూడదనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ తనకు రావాల్సిన రూ.5 కోట్ల బ్యాలెన్స్ రెమ్యునరేషన్‌ను తీసుకోలేదని నిర్మాత దిల్ రాజు వెల్లడించారు.
ది ప్యారడైజ్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ సందర్భంగా దిల్ రాజు ఈ ఆసక్తికర విషయాన్ని అభిమానులతో పంచుకున్నారు.
నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కిన ది ప్యారడైజ్ చిత్రం నైజాం ఏరియాలో రూ.50 కోట్ల మార్కును సులభంగా దాటుతుందని దిల్ రాజు ధీమా వ్యక్తం చేశారు.