
పాకిస్థాన్లోని బలూచిస్థాన్ పరిధిలోని కలత్, మస్తుంగ్, ఖరాన్ సహా ఐదు జిల్లాల జాతీయ రహదారులను దిగ్బంధించి సాయుధులు భద్రతా బలగాలపై మెరుపుదాడులు చేశారు.
బుధవారం కలత్లోని మంగుచార్ ప్రాంతంలో జరిగిన ఐఈడీ పేలుడులో ఆరుగురు పాక్ సైనికులు మరణించగా, ఖరాన్-కరాచీ హైవేపై ఒక వంతెనను భారీ యంత్రాలతో కూల్చివేశారు.
ఇరాన్ సరిహద్దు నుంచి వస్తున్న రెండు వాణిజ్య ట్రక్కులకు నిప్పు పెట్టగా, ఈ దాడుల వెనుక బలూచ్ లిబరేషన్ ఆర్బీ (బీఎల్ఏ) ఆర్థిక దిగ్బంధన వ్యూహం ఉన్నట్లు భావిస్తున్నారు.