
తమ సంస్థలో పనిచేసే ఉద్యోగుల ల్యాప్టాప్లను టీసీఎస్ ట్రాక్ చేస్తోందంటూ వచ్చిన వార్తలను ఆ సంస్థ ఖండించింది.
టెక్ రంగంలో కలకలం సృష్టించిన ఈ నిఘా ఆరోపణలపై టీసీఎస్ స్పందిస్తూ, అటువంటి చర్యలు చేపట్టడం లేదని స్పష్టం చేసింది.
ఉద్యోగుల గోప్యతకు సంబంధించి వచ్చిన ఈ వార్తలు నిరాధారమైనవని సంస్థ పేర్కొంది.