
దేశంలోని 80 శాతం యూనివర్సిటీల్లో కంప్యూటర్ సైన్స్ బోధన మూస పద్ధతుల్లోనే సాగుతోందని, దీనివల్ల కోర్సుల భవిష్యత్తు ప్రమాదంలో ఉందని ఏఐసీటీఈ హెచ్చరించింది.
ఏటా 8 లక్షల మందికి పైగా విద్యార్థులు కంప్యూటర్ కోర్సులను ఎంచుకుంటున్నా, కేవలం 9 శాతం మందికి మాత్రమే నైపుణ్యంతో కూడిన ఉపాధి లభిస్తోంది.
సాఫ్ట్వేర్ రంగంలో తొలి దశ ఇంటర్వ్యూల్లోనే 50 శాతం మంది విద్యార్థులు విఫలమవుతున్నారని, ప్రాక్టికల్ విద్యపై దృష్టి పెట్టాలని ఏఐసీటీఈ సూచించింది.