
హైదరాబాద్లోని ఐఎస్ సదన్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన హిట్ అండ్ రన్ ప్రమాదంలో ఇజాన్ ఉద్దీన్ అనే మూడేళ్ల బాలుడు అక్కడికక్కడే మృతి చెందాడు.
బాలుడు తన తల్లిదండ్రులతో కలిసి చాట్ తినేందుకు వెళ్లిన సమయంలో, XUV (AP11AN6899) నంబర్ గల కారు ఢీకొట్టి ఆపకుండా వెళ్లిపోయింది.
ఘటనా స్థలాన్ని యాకత్పురా ఎమ్మెల్యే జాఫర్ హుస్సేన్ సందర్శించగా, పోలీసులు కేసు నమోదు చేసి సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితుడి కోసం గాలిస్తున్నారు.