
విశాఖపట్నం రైల్వే స్టేషన్ సమీపంలో ఫుట్‌పాత్‌పై నిద్రిస్తున్న నాలుగేళ్ల బాలికను అర్ధరాత్రి గుర్తుతెలియని యువతీ, యువకుడు కిడ్నాప్ చేశారు.
సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితులు ప్రతిభ, ఉపేంద్ర అనే వ్యక్తులు స్కూటీపై బాలికను గాజువాక వైపు తీసుకెళ్లినట్లు పోలీసులు గుర్తించారు.
విజయవాడకు చెందిన తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి బాలిక ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.