
కదిరిలోని వాల్మీకి విద్యా సంస్థల ప్రాంగణంలో అభిజ్ఞ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా జాబ్ మేళాకు ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ మేళాలో 30కి పైగా కంపెనీలు పాల్గొని వెయ్యికి పైగా ఉద్యోగ అవకాశాలను నిరుద్యోగ యువతకు కల్పించాయి.
అర్హత, నైపుణ్యం ఉన్న యువతకు ఉపాధి కల్పించేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఎంతో ప్రయోజనకరమని ఎమ్మెల్యే పేర్కొంటూ ఎంపికైన అభ్యర్థులను అభినందించారు.