
ఏషియాడ్ టోర్నమెంట్‌లో భారత స్క్వాష్ ఆటగాళ్లు అద్భుత ప్రదర్శన కనబరిచారు.
మిక్స్‌డ్ డబుల్స్‌లో జోష్నా చిన్నప్ప–వెలవన్ సెంథిల్‌కుమార్ జోడి సెమీస్‌కు దూసుకెళ్లగా, సింగిల్స్‌లో అనహత్ సింగ్, అభయ్ సింగ్ తుది నాలుగు స్థానాలకు అర్హత సాధించారు.
దీంతో భారత్‌కు ఈ క్రీడా విభాగంలో మూడు పతకాలు ఖాయమయ్యాయి.