
రాష్ట్రంలో పెరుగుతున్న పెట్టుబడులు ఆర్థిక పునరుద్ధరణకు నిదర్శనమని మంత్రి నారా లోకేశ్ పేర్కొన్నారు.
పార్లమెంట్ సమావేశాల్లో వైకాపా ఎంపీలు అడిగే ప్రశ్నలకు కేంద్రం ఇచ్చే సమాధానాలే ఏపీ అభివృద్ధిని చాటిచెబుతున్నాయని ఆయన అన్నారు.
రాష్ట్ర అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని వైకాపా ఎంపీలు పార్లమెంట్లో మరిన్ని ప్రశ్నలు అడగాలని లోకేశ్ సూచించారు.