
ముఖ్యమంత్రి చంద్రబాబు శుక్రవారం పోలవరం ప్రాజెక్టుతో పాటు రాష్ట్రంలోని 35 ప్రాధాన్య ప్రాజెక్టుల పురోగతిపై సమీక్ష నిర్వహించనున్నారు.
పోలవరం ఎడమ ప్రధాన కాలువ ద్వారా అనకాపల్లికి గోదావరి జలాల తరలింపు అంశంపై జలవనరుల శాఖ అధికారులతో చర్చించనున్నారు.
ప్రాజెక్టుల నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేసేందుకు అవసరమైన దిశానిర్దేశం చేయనున్నట్లు అధికారులు తెలిపారు.