
పేదలను వారి జీవనోపాధికి దూరంగా ఇతర ప్రాంతాలకు పంపకుండా వారి నియోజకవర్గాల్లోనే ఇందిరమ్మ ఇళ్లు నిర్మించి ఇస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.
హైదరాబాద్‌లో ఇందిరమ్మ టవర్ల నిర్మాణానికి చర్యలు చేపట్టామని, వచ్చే ఏడాది బోనాల పండగ నాటికి గృహప్రవేశాలు జరిగేలా ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు.
మార్కెట్లో రూ.310-320 ఉన్న సిమెంట్ బ్యాగ్‌ను పేదలకు రూ.230కే అందించేలా ఒప్పందం కుదుర్చుకున్నట్లు పేర్కొన్నారు.