
విటమిన్ బి12 శక్తిని విడుదల చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది కాబట్టి, దీనిని ఉదయం లేదా మధ్యాహ్నం సమయంలో తీసుకోవడం మంచిదని వైద్యులు సూచిస్తున్నారు.
ఈ సప్లిమెంట్లను టీ లేదా కాఫీతో కాకుండా నీటితో తీసుకోవాలని, రక్త పరీక్ష చేయించుకున్న తర్వాతే వైద్యుల సలహాతో వాడాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
శాకాహారులు లేదా వెగన్ డైట్ పాటించేవారు గుడ్లు, పాలు, పెరుగు వంటి ఆహారాలతో పాటు ఫోర్టిఫైడ్ ఫుడ్స్ తీసుకోవడం ద్వారా బి12 లోపాన్ని అధిగమించవచ్చు.