
అమెరికాలోని ఇల్లినాయిస్‌కు చెందిన ఒక వ్యక్తికి స్నేహితుడు బహుమతిగా ఇచ్చిన లాటరీ టికెట్ 1 మిలియన్ డాలర్ల (రూ. 9 కోట్లు) జాక్‌పాట్‌ను తెచ్చిపెట్టింది.
మొదట ఆ టికెట్‌పై కేవలం 1,000 డాలర్లు గెలిచానని భావించిన సదరు వ్యక్తి, లాటరీ కార్యాలయానికి వెళ్ళినప్పుడు అసలు విషయం తెలిసింది.
ఆగస్టు 8న తీసిన 'లోట్టో మిలియన్ 2' డ్రాలో 11, 17, 22, 26, 36, 45 నంబర్లు సరిపోలడంతో ఈ భారీ బహుమతి లభించింది.