
ఆసియా గేమ్స్ పోటీల్లో అద్భుత ప్రదర్శన చేసి స్వర్ణ పతకం సాధించిన భారత మహిళల హాకీ జట్టు సభ్యులు బెంగళూరు చేరుకున్నారు.
బెంగళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో వీరికి క్రీడా అధికారులు, అభిమానులు ఘనంగా స్వాగతం పలికారు.
ఆసియా క్రీడల్లో దేశానికి స్వర్ణం తెచ్చిపెట్టిన మహిళా హాకీ క్రీడాకారిణులకు విమానాశ్రయంలో ఘన సత్కారం లభించింది.