భూపాలపల్లి మైనింగ్ ఏడీ బొజ్జ జయరాజు నివాసాల్లో ఏసీబీ అధికారులు నిర్వహించిన సోదాల్లో భారీగా అక్రమాస్తులు బయటపడ్డాయి.
బోడుప్పల్ నుండి భూపాలపల్లి వరకు జరిపిన దాడుల్లో సుమారు రూ.100 కోట్ల విలువైన ఆస్తులను అధికారులు గుర్తించారు.
అవినీతి ఆరోపణల నేపథ్యంలో జయరాజుపై కేసు నమోదు చేసి, తదుపరి విచారణను ఏసీబీ ముమ్మరం చేసింది.