
రాజమహేంద్రవరంలోని జీఎస్ఎల్ వైద్య కళాశాల విద్యార్థిని డాక్టర్ ప్రియాంక కోలుకోవాలని కోరుతూ ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి శనివారం రాత్రి కళాశాల ప్రాంగణంలో నిర్వహించిన ప్రదర్శనలో పాల్గొన్నారు.
ప్రమాదానికి కారణమైన నిందితులను కఠినంగా శిక్షించాలని కోరుతూ రైతు కూలీ సంఘం, అఖిల భారత కార్మిక సంఘాల సమాఖ్య ఆధ్వర్యంలో రంపయర్రంపాలెం గ్రామంలో నిరసనలు చేపట్టారు.
ఈ ఘటనపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని రైతు కూలీ సంఘం ప్రధాన కార్యదర్శి కర్నాకుల వీరాంజనేయులు డిమాండ్ చేయగా, ఎంపీ పురందేశ్వరి ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు.