
జింబాబ్వేలోని హరారే చివు ఏరియాలో శుక్రవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మినీబస్, ట్రక్కు ఢీకొనడంతో 27 మంది ప్రాణాలు కోల్పోయారు.
ప్రమాద స్థలంలోనే 23 మంది మృతి చెందగా, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరో నలుగురు మరణించారని పోలీసులు ధృవీకరించారు.
మతపరమైన సమావేశానికి వెళ్తున్న మినీబస్‌ను ఓవర్ టేక్ చేయడానికి ప్రయత్నించిన ట్రక్కు అదుపు తప్పి ఢీకొనడంతో ఈ విషాదం చోటుచేసుకుంది.