
మిడిల్ ఈస్ట్ ఉద్రిక్తతల నడుమ సౌదీ అరేబియాపై ఇరాన్ డ్రోన్లతో దాడి చేయగా, ప్రపంచంలోనే అతిపెద్దదైన తూర్పు-పశ్చిమ చమురు పైపులైన్ ధ్వంసమైంది.
దాదాపు 1,200 కిలోమీటర్ల పొడవున్న ఈ పైపులైన్ ద్వారా హార్ముజ్ జలసంధి గుండా ప్రపంచ దేశాలకు ముడి చమురు సరఫరా జరుగుతుండగా, దీని ద్వారానే గ్లోబల్ ఆయిల్ సప్లైలో 5 శాతం జరుగుతోంది.
ఈ దాడిని ధృవీకరించిన రియాద్ ప్రభుత్వం పైపులైన్‌ను తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు వెల్లడించగా, ఈ ఘటనలో భారీ ఆస్తి నష్టంతో పాటు పలువురు గాయపడ్డారు.