
న్యూజిలాండ్ స్టార్ ఆల్రౌండర్ రచిన్ రవీంద్ర కమర్షియల్ యాడ్ షూట్లో డైవింగ్ క్యాచ్ పట్టే ప్రయత్నంలో గాయపడ్డాడు.
ఈ ఘటనలో రచిన్ కుడి భుజం డిస్లోకేట్ కాగా, అక్టోబర్ 22 నుంచి ప్రారంభం కానున్న భారత్-న్యూజిలాండ్ సిరీస్కు అతను దూరమయ్యాడు.
రచిన్ రికవరీని గమనిస్తున్న న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు, వచ్చే ఆరు నెలల్లో టెస్టు షెడ్యూల్ ఉన్నందున అతని విషయంలో తొందరపడబోమని స్పష్టం చేసింది.