
ఉక్రెయిన్పై దాడులను మరింత తీవ్రతరం చేసేందుకు రష్యా సన్నాహాలు చేస్తోందని ఆ దేశ అధ్యక్షుడు జెలెన్స్కీ హెచ్చరించారు.
యుద్ధం కోసం రష్యా కొత్తగా కనీసం 3 లక్షల మంది సైనికులను సమీకరించేందుకు ఏర్పాట్లు చేస్తోందని జెలెన్స్కీ వెల్లడించారు.
రష్యా తీసుకుంటున్న ఈ తాజా చర్యలు ఉక్రెయిన్ భద్రతకు ముప్పుగా పరిణమించే అవకాశం ఉందని అంతర్జాతీయంగా ఆందోళన వ్యక్తమవుతోంది.