
ఆహార ఉత్పత్తులపై తప్పుడు లేదా ధ్రువీకరించని ఆరోగ్య క్లెయిమ్‌లను ప్రచారం చేసే సెలబ్రిటీలు, ఇన్ఫ్లుయెన్సర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని భారత ఆహార భద్రత, ప్రమాణాల ప్రాధికార సంస్థ (FSSAI) హెచ్చరించింది.
వినియోగదారుల రక్షణ చట్టం ప్రకారం, తప్పుడు ప్రకటనలకు పాల్పడితే మొదటిసారి రూ. 10 లక్షల వరకు, పునరావృతమైతే రూ. 50 లక్షల వరకు జరిమానా విధించే అవకాశం ఉందని స్పష్టం చేసింది.
ఇన్ఫ్లుయెన్సర్లు ప్రమోషన్లకు ముందు శాస్త్రీయ ఆధారాలను పరిశీలించాలని సూచించిన FSSAI, ఇటీవల డాబర్ ఇండియా ఉత్పత్తులపై '100%' క్లెయిమ్‌ల విషయంలో అభ్యంతరం వ్యక్తం చేస్తూ నిబంధనలను కఠినతరం చేసింది.