
ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం సమీపంలోని పుట్లగట్లగూడెం వద్ద గ్రీన్‌ఫీల్డ్ హైవేపై ఆగి ఉన్న లారీని ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది.
ఈ ప్రమాద సమయంలో బస్సులో సుమారు 30 మంది ప్రయాణికులు ఉండగా, బస్సు డ్రైవర్‌కు తీవ్ర గాయాలు, మరో 20 మంది ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి.
సమాచారం అందుకున్న లక్కవరం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టగా, గాయపడిన వారిని జంగారెడ్డిగూడెం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.