
జలంధర్‌లో జరిగిన ఆసియా చాంపియన్స్ ట్రోఫీ హాకీ మ్యాచ్‌లో భారత పురుషుల జట్టు 5–2 గోల్స్ తేడాతో చైనాపై ఘన విజయం సాధించింది.
భారత జట్టు తరఫున సుఖ్జీత్ సింగ్ (12, 34 నిమిషాలు), హర్మన్‌ప్రీత్ సింగ్ (27, 31 నిమిషాలు) రెండు గోల్స్ చొప్పున చేయగా, జుగ్రాజ్ సింగ్ ఒక గోల్ సాధించారు.
ఈ టోర్నమెంట్లో వరుసగా రెండో విజయం సాధించిన భారత్, శుక్రవారం జరిగే మ్యాచ్‌లో జపాన్‌తో తలపడనుంది.