
హైదరాబాద్ మూసాపేటలోని ఆంజనేయనగర్‌లో ఆదివారం ఉదయం లిఫ్ట్ ప్రమాదం సంభవించింది.
సెన్సార్లు సరిగా పనిచేయకపోవడంతో లిఫ్ట్‌కు గోడకు మధ్యలో ఇరుక్కుపోయిన మురళిని హైడ్రా రెస్క్యూ టీం రక్షించింది.
దాదాపు గంటన్నర పాటు శ్రమించి సిబ్బంది బాధితుడిని సురక్షితంగా బయటకు తీసి ఆసుపత్రికి తరలించారు.