
రణ్‌బీర్ కపూర్, సాయిపల్లవి ప్రధాన పాత్రల్లో నటించిన ‘రామాయణం’ చిత్రంపై బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
సినిమా బడ్జెట్ రూ. 4,000 కోట్లతో తెరకెక్కించారా, విజువల్స్ ఎలా ఉన్నాయి అనేదాని కంటే రామాయణ ఇతిహాసంలోని పాత్రల గురించి చర్చ జరగాలని ఆయన అభిప్రాయపడ్డారు.
నితేశ్ తివారీ దర్శకత్వం వహించిన ఈ సినిమాను నమిత్ మల్హోత్రా నిర్మించగా, యశ్ రావణుడి పాత్రలో నటించారు.