
అమెరికా ఫెడ్ వడ్డీ రేట్లు పెంచే అవకాశం ఉందనే ఆందోళనలతో సోమవారం ఉదయం సెన్సెక్స్ 309 పాయింట్లు, నిఫ్టీ 99 పాయింట్లు నష్టపోయాయి.
ఐటీ కంపెనీల షేర్లలో అమ్మకాల ఒత్తిడి పెరగడంతో ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా, హెచ్‌సీఎల్ టెక్నాలజీ షేర్లు భారీగా పడిపోయాయి.
శుక్రవారం విదేశీ ఇన్వెస్టర్లు భారత మార్కెట్ల నుంచి రూ.3,112 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకోవడం కూడా మార్కెట్లపై ప్రతికూల ప్రభావం చూపింది.