
మిజోరంలోని లుంగ్లే జిల్లాలో 80 పాఠశాలలకు చెందిన 5,500 మందికి పైగా విద్యార్థులకు జనరేటివ్ ఏఐపై శిక్షణ అందించనున్నారు.
లుంగ్లే జెన్-ఏఐ మిషన్ పేరిట చేపట్టిన ఈ కార్యక్రమాన్ని సీఎం లాల్దుహోమా శుక్రవారం ప్రారంభించారు.
జిల్లా విద్యాశాఖ, కోడ్‌యోగి ఫౌండేషన్ సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నాయి.