
ఉక్రెయిన్‌లోని మూడో అతిపెద్ద నగరమైన ఒడెసాలో ప్రభుత్వ కార్యాలయాలు, కళా, వినోద ప్రదేశాల్లో రష్యన్ భాషా వినియోగాన్ని నిలిపివేయాలని ప్రతిపాదన తెరపైకి వచ్చింది.
రష్యన్ పాటలు, సాహిత్యాన్ని బహిరంగంగా ప్రదర్శించకూడదని, లైబ్రరీల్లో రష్యన్ పుస్తకాలను ప్రముఖంగా ఉంచకూడదని ఈ ప్రతిపాదనలో పేర్కొన్నారు.
ఈ నిర్ణయంపై స్థానికంగా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతుండగా, రష్యా సాంస్కృతిక ప్రభావాన్ని తగ్గించేందుకు ఉక్రెయిన్ భాషా ఉద్యమకారులు ఈ చర్యలు చేపడుతున్నారు.