
కాంగ్రెస్ ప్రభుత్వం 1000 రోజుల్లో హామీలను అమలు చేయడంలో విఫలమైందని, కేవలం అరెస్టులు, అక్రమ నిర్బంధాలకే పరిమితమైందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు.
ప్రభుత్వం హామీలను అమలు చేస్తే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలంతా స్వచ్ఛందంగా అరెస్టు కావడానికి సిద్ధమని ఆయన సవాల్ విసిరారు.
ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్కుమార్రెడ్డిల అరెస్టును తప్పుబడుతూ, హైకోర్టు వ్యాఖ్యలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని కేటీఆర్ ఆరోపించారు.