
2018 గ్రూప్-1 మెయిన్స్ పరీక్షల మూల్యాంకనంలో భారీ అక్రమాలు జరిగినట్లు సిట్ 10,720 పేజీల నివేదికను హైకోర్టుకు సమర్పించింది.
అప్పటి ఏపీపీఎస్సీ కార్యదర్శి పీఎస్ఆర్ ఆంజనేయులు ఆధ్వర్యంలో, టెన్త్, ఇంటర్ చదివిన వారితో మూల్యాంకనం చేయించి మార్కులను తారుమారు చేశారు.
మెయిన్స్‌లో ఎక్కువ మార్కులు వచ్చిన వారికి ఇంటర్వ్యూలో తక్కువ, తక్కువ వచ్చిన వారికి ఎక్కువ మార్కులు వేసి అభ్యర్థుల ఉద్యోగాలను దెబ్బతీశారు.